Manish Sisodia: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో ఛార్జీషీట్

Delhi Excise Policy Scam Case CBI names Sisodia in charge sheet
  • సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఛార్జీషీటు
  • తాజా చార్జిషీటులో సిసోడియా, రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు పేర్లు
  • ఇతర నిందితుల పేర్లను చేర్చిన విచారణ సంస్థ
సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో సీబీఐ మరో ఛార్జీషీట్ ను దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితర పేర్లతో అదనపు ఛార్జిషీటును దాఖలు చేసింది. ఇందులో నిందితులుగా సిసోడియాతో పాటు అరుణ్ రామచంద్ర పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు పేర్లను పేర్కొంది. మరికొంతమంది ఇతర నిందితుల పేర్లను కూడా చేర్చింది.

గత ఏడాది నవంబర్ నెలలో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ అందులో అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్, అబ్కారీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి పేర్లను చేర్చింది. సమీర్ మహేంద్రు, రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్ ల పేర్లను కూడా నిందితులుగా చేర్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి రెండు నెలల క్రితం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిసోడియా బెయిల్ కోసం దరఖాస్తు చేయగా, ఢిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
Manish Sisodia
Delhi Liquor Scam

More Telugu News