Andhra Pradesh: నేడు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. ఈదురు గాలులు!

Rains Expected Today In Rayalaseema And Coastal Andhra

  • మరాఠ్వాడా మీదుగా కర్ణాటక వరకు ద్రోణి 
  • నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు
  • అనంతపురంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా మరాఠ్వాడ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో నిన్న అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

నిన్న మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉక్కపోతతోపాటు ఎండ తీవ్రత కొనసాగింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతపురంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.

  • Loading...

More Telugu News