James Gunn: జూనియర్ ఎన్టీఆర్ తో కలసి పనిచేస్తానంటున్న హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్

James Gunn would love to work with Jr NTR calls him amazing and cool
  • ఆర్ఆర్ఆర్ లో అద్భుతంగా నటించాడంటూ ప్రశంసలు
  • ఏదో ఒక రోజు కలసి పనిచేస్తానన్న జేమ్స్ గన్
  • ఎన్టీఆర్ కోసం ఇంకా ఏ తరహా పాత్రనూ అనుకోలేదని వెల్లడి
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ .. నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలసి పని చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమాని మెచ్చుకున్న వారిలో జేమ్స్ కూడా ఒకరు. గతేడాది ఆర్ఆర్ఆర్ థియేటర్లలో స్క్రీనింగ్ సమయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లడం గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంగా పలువురు దర్శకుల దృష్టిలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పడ్డారు. జేమ్స్ గన్ తాను రూపొందించిన గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 5న థియేటర్లలోకి రానుంది. 

ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ నటన జేమ్స్ కు బాగా నచ్చినట్టుంది. అందుకే తాను జూనియర్ ఎన్టీఆర్ తో కలసి పనిచేయడాన్ని ఇష్టపడతానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. ‘‘ఆర్ఆర్ఆర్ లో నటించిన అతడు చాలా బాగా చేశాడు. అతడి పేరు ఏంటి?, ఆర్ఆర్ఆర్, గతేడాది వచ్చిన పెద్ద చిత్రం. పులులు అన్నీ బోను నుంచి బయటకు వస్తాయి. అతను కూడా (జూనియర్ ఎన్టీఆర్)! ఏదో ఒక రోజు అతడితో కలసి పనిచేయడాన్ని ఇష్టపడతా. చాలా బాగా, చాలా కూల్ గా చేశాడు’’ అంటూ న్యూస్18 సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేమ్స్ గన్ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఏదైనా పాత్ర మీ మనసులో ఉందా? అని టీవీ ప్రెజెంటేటర్ అడగ్గా.. ఇంకా ఆ విషయంలో పని చేయాల్సి ఉందని, అందుకు సమయం పడుతుందని జేమ్స్ చెప్పారు.
James Gunn
Hollywood
director
Jr NTR
love to work
Hollywood chance

More Telugu News