Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సర్ ప్రైజ్ లోడింగ్​!

A Surprise LOADING  from Ustad Bhagat Singh For May 11th
  • హరీశ్ శంకర్ తో ఉస్తాద్ సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్
  • ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్
  • మే11తో  ఆ సినిమాకు 11 ఏళ్లు 
  • ఆ రోజు ఉస్తాద్ నుంచి స్పెషల్ గ్లింప్స్ వస్తుందని ప్రచారం
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ చేతి నిండా సినిమాలున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఆయన బిజీగా ఉన్నారు. మొన్నటిదాకా క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ల పాల్గొన్న పవన్ ఇప్పుడు  హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లో అడుగు పెట్టారు. 11 ఏళ్ల కిందట హరీశ్ శంకర్–పవన్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్‌ సింగ్‌ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మే 11తో గబ్బర్ సింగ్ విడుదలై 11 సంవత్సరాలు కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ ను విడుదల చేసి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయాలని చిత్ర బృందం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అదే జరిగితే పవన్ ఫ్యాన్స్ కు పండగే కానుంది. హరహర వీరమల్లు, ఉస్తాద్ తో పాటు పవన్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. తన మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి వినోదయ్‌ సిత్తం రీమేక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరగుతోంది.  సాహో ఫేమ్ సుజీత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది.
Pawan Kalyan
harish shankar
Ustad Bhagat Singh
glimps
gabbar singh

More Telugu News