Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ కమిటీని నియమించిన బీజేపీ.. కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..!
- జగన్ చెప్పిన అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కమిటీ ఏర్పాటు
- 11 మందితో కమిటీని ప్రకటించిన సోము వీర్రాజు
- కమిటీ మార్గదర్శకురాలిగా పురందేశ్వరి.. సభ్యులుగా సీఎం రమేశ్, జీవీఎల్
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఛార్జ్ షీట్ కమిటీని వేసింది. ఈ కమిటీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయుల్లో సమస్యలను గుర్తిస్తుంది. గుర్తించిన సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుంది. ముఖమంత్రి జగన్ చెప్పిన అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కమిటీ కార్యాచరణను రూపొందించారు. 11 మందితో కూడిన ఈ కమిటీ మార్గదర్శకులుగా దగ్గుబాటి పురందేశ్వరి, వై. సత్యకుమార్ ఉంటారు. కన్వీనర్ గా పీవీఎన్ మాధవ్... సభ్యులుగా సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, కొత్తపల్లి గీత, ఐవైఆర్ కృష్ణారావు, వాకాటి నారాయణ రెడ్డి, పీడీ పార్థసారధి, నిమ్మక జయరాజు, వీ శ్రీనివాసబాబులను నియమించారు. కమిటీ సభ్యులను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.