Corona Virus: భారత్‌లో కొత్తగా 9,355 కరోనా కేసులు

India logs 9355 fresh corona cases

  • నిన్నటితో పోలిస్తే 2.8 శాతం తగ్గిన రోజువారీ కేసుల సంఖ్య
  • కొత్తగా 24 కరోనా మరణాలు, కేరళలోనే ఆరుగురి మృతి
  • ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 57,410
  • కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 9,355 కరోనా కేసులు వెలుగు చూసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. నిన్నటి లెక్కలతో పోలిస్తే ఇది 2.8 శాతం తక్కువని పేర్కొంది. తాజా లెక్కల ప్రకారం, ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 57,410. ఇక బుధవారం దేశవ్యాప్తంగా 26 కరోనా మరణాలు సంభవించగా, ఒక్క కేరళలోనే ఆరుగురు అసువులు బాసారు. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 5,31,424 కరోనా మరణాలు సంభవించాయి. 

దేశంలో కరోనా వ్యాప్తిని సూచించే రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 5.36 శాతమని తెలిపింది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.13 శాతమన్న కేంద్రం, కొవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా ఉందని వెల్లడించింది. ఇక దేశంలో ఇప్పటివరకూ 22.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు.

  • Loading...

More Telugu News