KCR: తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. అమరులకు నివాళి అర్పించిన కేసీఆర్
- తెలంగాణ భవన్ లో పార్టీ ఆవిర్భావ వేడుకలు
- ప్రారంభమైన బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్
- మొత్తం 279 మందికి ఆహ్వానం
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్ లో ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ కు ఆయన హాజరయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హజరయ్యారు.
కేవలం ఆహ్వానం ఉన్న నేతలను మాత్రమే తెలంగాణ భవన్ లోకి అనుమతించారు. మొత్తం 279 మందికి ఆహ్వానం అందింది. వీరిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, పార్టీ కార్యనిర్వాహక సభ్యులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలు పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరగనుంది. మరోవైపు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.