YV Subba Reddy: తిరుమల కొండ గగనతలంపై హెలికాప్టర్లు తిరగడంపై వైవీ సుబ్బారెడ్డి స్పందన

YV Subba Reddy response on helicopters flying on Tirumala
  • ఈ నెల 25న తిరుమల మీద నుంచి వెళ్లిన మూడు హెలికాప్టర్లు
  • అవి మిలిటరీ హెలికాప్టర్లు అన్న వైవీ సుబ్బారెడ్డి
  • దేశ భద్రత విషయంలో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్య
పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల కొండపై ఈ నెల 25న మూడు హెలికాప్టర్లు వెళ్లడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తిరుమల గగనతలంపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమలపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీకి చెందినవని చెప్పారు. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం జోక్యం చేసుకోలేమని తెలిపారు. 

మరోవైపు సులభ కార్మికులు ఆకస్మికంగా విధులను బహిష్కరించడంపై సుబ్బారెడ్డి మాట్లాడుతూ... భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. విధులకు హాజరైన తర్వాత డిమాండ్లు అడిగితే తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు త్వరలోనే ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని చెప్పారు. టీటీడీ ఉద్యోగుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఈరోజు సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
YV Subba Reddy
TTD
Helicopter

More Telugu News