KCR: డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల జాబితా ఉంది: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్

KCR warning to brs party mlas

  • దళిత బంధు పథకంలో డబ్బులు వసూలు చేసే వారి జాబితా ఉందన్న కేసీఆర్
  • అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత అన్న సీఎం
  • వ్యక్తిగత ప్రతిష్టలకు పోవద్దని ముఖ్యమంత్రి హితవు

దళిత బంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని, ఆ ఎమ్మెల్యేలకు ఇదే తన చివరి వార్నింగ్ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. మరోసారి తప్పు చేస్తే పార్టీ నుండి తప్పిస్తామని స్పష్టం చేశారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోను ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వ్యక్తిగత ప్రతిష్టలకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమన్నారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సీనియర్ నేత కడియం శ్రీహరిల మధ్య విభేదాలపై తీవ్రంగా స్పందించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని చెప్పారు. నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవద్దని, ఎలాంటి సమస్య ఉన్నా అధిష్ఠానంతో చెప్పి ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికలే లక్ష్యంగా అందరూ కలిసి పని చేయాలన్నారు. దళితబంధుపై ప్రతిపక్షాలు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు.

KCR
  • Loading...

More Telugu News