Rs 50k salary: రూ.50వేలు సంపాదించినా మిగిలేది లేదు.. ఈ జీతాలేంటి?
- మెట్రోల్లో జీవనం ఖరీదుగా మారిందన్న ట్విట్టర్ యూజర్
- ఫ్రెషర్లు అంత తక్కువ జీతాలతో ఎలా బతికేది? అంటూ ప్రశ్న
- మన ఎంపికలే ఖర్చులను నిర్ణయిస్తాయంటూ నెటిజన్ల బదులు
నేడు దేశ ప్రజల సగటు ఆదాయం పెరిగింది. కానీ, తరచి చూస్తే జీవన వ్యయం అంతకంటే ఎక్కువే పెరిగిందని అర్థమవుతుంది. ఎంత సంపాదించినా మిగిలేది ఏమీ లేక, భారీ ఖర్చులతో సగటు మధ్య తరగతి కుటుంబీకులు సతమతం అవుతున్నారు. ఈ తరుణంలో నెట్టింట మేధా గంటి అనే యువతి పెట్టిన పోస్ట్ ఆసక్తికర చర్చకు తావిచ్చింది. రూ.50వేలు సంపాదిస్తే కానీ మెట్రోల్లో బతికే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఫ్రెషర్లకు ఈ జీతాలేంటి? అంటూ ఆమె ప్రశ్న సంధించింది.