KCR: కేసీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇస్తుందా?: రఘునందన్ రావు సూటి ప్రశ్న

Raghunandan rao question to kcr and acb

  • ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని నిలదీత
  • తప్పు చేసిన వారిని మందలించాల్సింది పోయి వెనుకేసుకు రావడం ఏమిటన్న రఘునందన్
  • సొంత పార్టీ నేతల అవినీతిపై సీబీఐ దర్యాఫ్తు కోరే దమ్ముందా అని ప్రశ్న

సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు శుక్రవారం ప్రశ్నించారు. తప్పు చేసిన మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి మందలించాల్సింది పోయి వెనుకేసుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

వారిపై సీబీఐ దర్యాఫ్తును కోరే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉందా అని నిలదీశారు. ఈ అంశాన్ని ఏసీబీ సుమోటో కేసుగా నమోదు చేసి, కేసీఆర్ కు నోటీసులు ఇస్తుందా? అని ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనూ డబుల్ బెడ్రూం ఇళ్లకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News