Rajinikanth: ఎన్టీఆర్ లా మేకప్ వేసుకుని ఫొటో దిగితే కోతిలా ఉన్నావని అన్నాడు: రజనీకాంత్

Rajinikanth speech in NTR Centenary Celebrations inaugural program
  • విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ సభ
  • హాజరైన రజనీకాంత్
  • ఎన్టీఆర్ పై రెండు పుస్తకాలు ఆవిష్కరణ
  • ఎన్టీఆర్ లా ఉండాలనుకున్నానని రజనీ వెల్లడి
  • ఎన్టీఆర్ క్రమశిక్షణ ఉన్న వ్యక్తి అని కితాబు
తెలుగుజాతి కీర్తి పతాకాన్ని ఘనంగా ఎగురవేసిన నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల ప్రారంభ సభకు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ విచ్చేశారు. విజయవాడలోని పోరంకిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

హీరోగా తన తొలి చిత్రం పేరు భైరవి అని రజనీకాంత్ వెల్లడించారు. ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి సినిమా గుర్తుకొచ్చి భైరవి సినిమాలో హీరో పాత్రకు ఒప్పుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చానని వివరించారు. పలు చిత్రాల్లో ఎన్టీఆర్ ధుర్యోధనుడి పాత్ర చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. 1977లో ఎన్టీఆర్ తో కలిసి టైగర్ అనే చిత్రంలో నటించానని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. 

"నాపై ఎన్టీఆర్ ప్రభావం చాలానే ఉంది. అప్పట్లో గద పట్టుకుని ఎన్టీఆర్ ను అనుకరించేవాడిని. దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ లా ఉండాలనుకున్నాను. ఓసారి ఎన్టీఆర్ లా మేకప్ వేసుకుని ఫొటో దిగి నా స్నేహితుడికి చూపిస్తే, కోతిలా ఉన్నావని అన్నాడు. అప్పుడు అనిపించింది... ఎన్టీఆర్ లా ఉండడం నా వల్ల కాదని! ఎన్టీఆర్ క్రమశిక్షణ పాటించేవారు" అని రజనీకాంత్ వివరించారు.
Rajinikanth
NTR
Centenary Celebrations
Vijayawada
Andhra Pradesh

More Telugu News