Tamilnadu: చెన్నైలో ఎనీ టైం మందు (ఏటీఎం) మెషిన్లు

Tasmac installs liquor vending machine in Chennai elite shop
  • నగరంలో నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన తమిళనాడు ప్రభుత్వం
  • నచ్చిన బ్రాండ్ ను ఎంపిక చేసుకుని డబ్బులు చెల్లిస్తే తక్షణం మందు లభ్యం
  • ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ నేత ఖుష్బూ సెటైర్
బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు వెళ్లడం సాధారణమే.. కానీ చెన్నైలో మాత్రం మందుబాబులు ఏటీఎంల ముందు క్యూ కట్టే రోజులు వచ్చేశాయి. అదేంటి, మందుబాబులకు ఏటీఎంలతో పనేంటి, వైన్ షాపులలో ఏటీఎం కార్డుతో కూడా మందు కొనుగోలు చేయొచ్చు కదా అనుకుంటున్నారా?.. చెన్నైలో కొత్త ఏటీఎంలు వచ్చేశాయి. ఇందులో మనీ కాదు మద్యం తీసుకోవచ్చు. ఇరవై నాలుగు గంటలూ మద్యం కొనుగోలు చేసేందుకు ఈ మెషిన్లను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి కోయంబేడుతో పాటు మరో మూడు చోట్ల ఈ మెషిన్లను అధికారులు ప్రారంభించారు.

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ మెషిన్ల నుంచి ఎనీ టైం మందు కొనుగోలు చేయొచ్చు. ఏటీఎంలానే పనిచేసే ఈ మెషిన్లలో ముందుగా పైన కనిపించే బ్రాండ్లలో కావాల్సిన బ్రాండ్ ను ఎంచుకోవాలి. వెంటనే దాని ధరను మెషిన్ చూపిస్తుంది. ఆ మొత్తాన్ని డిజిటల్ (ఆన్ లైన్ లో) రూపంలో చెల్లిస్తే.. మెషిన్ కింది బాగంలో నుంచి సీసా బయటకు వస్తుంది. ఈ మెషిన్లు అందుబాటులోకి రావడంతో ఇక మద్యం షాపులు మూసేస్తారని కానీ ఉదయాన్నే వైన్స్ తెరవరని, కానీ టెన్షన్ పడాల్సిన అవసరం మందుబాబులకు ఉండదు.

ఇదిలావుంచితే, ఎనీ టైం మద్యం మెషిన్ల ఏర్పాటుపై బీజేపీ నేత ఖుష్బూ సుందర్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే సర్కారు తీసుకొచ్చిన ఎనీ టైం మద్యం మెషిన్ల ఐడియా సూపర్ గా ఉందంటూ సెటైర్ వేశారు. మద్యం అమ్మకాలను తగ్గించాల్సిన ప్రభుత్వం.. ఆదాయం కోసం ఇలా ఇరవై నాలుగ్గంటలూ లిక్కర్ అమ్ముకునే ఏర్పాట్లు చేయడాన్ని ఖుష్బూ తప్పుబట్టారు.
Tamilnadu
chennai
ATM
liquor vending machine
Tasmac

More Telugu News