Uber Cabs: ఊబర్ కార్లలో మర్చిపోతున్న వస్తువులను చూస్తే అవాక్కవ్వాల్సిందే!

Fingernails to pregnancy test heres a list of things people left behind in Uber Cabs
  • టాప్ 10 లో ఫోన్లు, వ్యాలెట్లు, తాళం చెవులు, హెడ్ ఫోన్లు 
  • వినూత్నమైన వస్తువుల్లో ప్రెగ్నెన్సీ కిట్, వేలిగోళ్లు 
  • వివరాలు విడుదల చేసిన ఊబర్
పట్టణాల్లో ఊబర్ ట్యాక్సీ సేవలను ఎక్కువ మంది వినియోగించుకుంటూ ఉంటారు. ఇలా కార్లు ఎక్కి, కంగారుగా గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో కొందరు కొన్ని వస్తువులను మర్చిపోతుంటారు. ఈ వివరాలను ఏటా ఊబర్ విడుదల చేస్తుంటుంది. 2022 సంవత్సరానికి సంబంధించిన వివరాలను తాజాగా విడుదల చేసింది. ఇవి కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. 

సాధారణంగా మర్చిపోయే 10 వస్తువులకుతోడు, 50 చాలా ప్రత్యేకమైన వస్తువుల వివరాలను కూడా ఊబర్ వెల్లడించింది. వస్త్రాలు, ఫోన్లు, బ్యాక్ ప్యాక్ లు, పర్సులు, వ్యాలెట్లు, హెడ్ ఫోన్లు, జ్యుయలరీ, తాళం చెవులు, పుస్తకాలు, ల్యాప్ టాప్ లు వాచీలు ఇవి ఎక్కువ మంది  మర్చిపోతున్న టాప్ 10 జాబితాలో ఉన్నాయి. 

ఇక ఊబర్ కార్లలో వదిలేసి వెళ్లే వినూత్నమైన వస్తువుల్లో డానీ డీవిటో క్రిస్ మస్ ఆర్నమెంట్ కూడా ఉంది. ఫాగ్ మెషిన్, స్టెయిన్ లెస్ స్టీల్ గువా షా టూల్, లైట్ సాబర్, వేలి గోళ్లు, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లు, చీజ్ కేకులు, ఉన్నాయి. తాము మర్చిపోయిన వస్తువుల గురించి కొందరు రైడర్లు ఊబర్ ను సంప్రదిస్తుంటారు. కొందరు ట్యాక్సీ డ్రైవర్లు ఊబర్ కు రిపోర్ట్ చేస్తుంటారు. వాటి ఆధారంగా ఈ వివరాలు విడుదలయ్యాయి.
Uber Cabs
riders
forget
lost items
pregnancy test kit
nails
phones
wallets

More Telugu News