Sunil Gavaskar: కెప్టెన్‌గా అతడు ధోనీ లాంటోడే.. యువ ఆటగాడిపై గవాస్కర్ ప్రశంసలు!

hardik is Very Similar To MS Dhoni says Sunil Gavaskar
  • కెప్టెన్‌గా హార్దిక్ తన వారసత్వాన్ని వదిలి వెళ్తాడన్న గవాస్కర్
  • ధోనీ నుంచి మంచి లక్షణాలను పొందాడని ప్రశంసలు
  • హార్దిక్ తన వ్యక్తిత్వాన్ని జట్టుపై రుద్దడానికి ప్రయత్నించడం లేదని వ్యాఖ్య
గతేడాది ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చింది గుజరాత్. తొలి సీజన్ లోనే ట్రోఫీని అందుకుని రికార్డు స‌ృష్టించింది. ఇందులో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పాత్ర కీలకం. ఐపీఎల్ లో రోహిత్ శర్మ నీడలో, జాతీయ జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో రాటుదేలిన ఈ క్రికెటర్.. వరుసగా రెండో సీజన్ లోనూ తన టీమ్ ను ట్రోఫీ వైపుగా నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా గురించి లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

స్టార్ స్పోర్ట్స్ తో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్లు కొన్నిసార్లు తమ వ్యక్తిత్వాన్ని, జట్టు వ్యక్తిత్వాన్ని ఒకే విధంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ కెప్టెన్, జట్టు వ్యక్తిత్వం భిన్నంగా ఉండవచ్చు. హార్దిక్ మాత్రం తన వ్యక్తిత్వాన్ని జట్టుపై రుద్దడానికి ప్రయత్నించడం లేదు. గుజరాత్ టైటాన్స్ తో హార్దిక్ చేస్తున్నది అదే’’ అని చెప్పారు.

కెప్టెన్‌గా హార్దిక్ తన వారసత్వాన్ని వదిలి వెళ్తాడని ప్రశంసలు కురిపించారు. హార్దిక్ ఓ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని మాదిరే ఉంటాడని గవాస్కర్ చెప్పారు. టీమిండియా మాజీ కెప్టెన్ నుంచి అతడు మంచి లక్షణాలను పొందాడని అన్నారు.

పాయింట్ల పట్టికలో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ మూడో స్థానంలో ఉంది. 7 మ్యాచ్ లు ఆడి ఐదింట గెలిచింది. రెండింట్లో ఓడిపోయింది. కనీసం ఏడు మ్యాచ్ లు ఆడిన మిగతా జట్లన్నీ కనీసం 3 మ్యాచ్ లలో ఓడిపోయాయి. తొలి రెండు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, లక్నో కూడా 8 మ్యాచ్ ల చొప్పున చెరో మూడు మ్యాచ్ లలో ఓడిపోయాయి.
Sunil Gavaskar
MS Dhoni
Hardik Pandya
legacy in IPL
captaincy
IPL 2023
Gujarat

More Telugu News