SRH: రివెంజ్ మ్యాచ్ లో 'విన్' రైజర్స్

SRH beat Delhi Capitals by 9 runs

  • 9 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై హైదరాబాద్ గెలుపు
  • తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు
  • లక్ష్యఛేదనలో 188 పరుగులే చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
  • ఓ దశలో హడలెత్తించిన మార్ష్, సాల్ట్
  • స్పిన్నర్ల చలవతో గట్టెక్కిన సన్ రైజర్స్

ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ను వారి సొంతగడ్డపై 9 పరుగుల తేడాతో చిత్తుచేసి దెబ్బకు దెబ్బ తీసింది. 

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. 

ఓ దశలో మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్ విజృంభణ చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు ఎంతో ఈజీ అనిపించింది. మార్ష్ 39 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 63 పరుగులు చేయగా... సాల్ట్ 35 బంతుల్లో 9 ఫోర్లతో 59 పరుగులు చేశాడు. 

అయితే సన్ రైజర్స్ స్పిన్నర్లు సమయోచితంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో ఢిల్లీకి 6 బంతుల్లో 26 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్ కుమార్ ఆ ఓవర్ లో బౌలింగ్ చేసి 16 పరుగులే ఇచ్చాడు. అక్షర్ పటేల్ 29 రిపల్ పటేల్ 11 పరుగులతో నాటౌట్ గా మిగిలారు.

అంతకుముందు ఓవర్ లో నటరాజన్ అసలు సిసలైన యార్కర్లు వేసి కేవలం 9 పరుగులే ఇవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశాలను దెబ్బతీసింది. సన్ రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే 2, భువనేశ్వర్ కుమార్ 1, అకీల్ హోసీన్ 1, నటరాజన్ 1, అభిషేక్ శర్మ 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News