Telangana: తూర్పు గేటు నుంచి వెళ్లి నూతన సచివాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR inaugarates new secratariet

  • రిబ్బన్ కట్ చేసి సచివాలయంలో అడుగు పెట్టిన సీఎం
  • ఆరో అంతస్తులో తన చాంబర్ కు వెళ్లి తొలి సంతకం
  • తమ చాంబర్లలో ఆసీనులైన మంత్రులు 

తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంఛనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి నూతన సచివాలయం సముదాయంలో అడుగు పెట్టారు. శిలాఫలకం ఆవిష్కరించి ఆరో అంతస్తులో తనకు కేటాయించిన చాంబర్ కు వెళ్లిన కేసీఆర్ సుముహూర్తంలో ఫైల్ పై తొలి సంతకం చేశారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న కేసీఆర్ కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు, శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. 

అదే సమయంలో మంత్రులు కూడా తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై సంతకాలు చేశారు. అంతకుముందు తూర్పు గేటు నుంచి సచివాలయానికి వచ్చిన సీఎంకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగ‌తం ప‌లికారు. బ్యాటరీ కారులో సచివాలయ ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన నడుచుకుంటూ యాగశాలకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం నిర్వహించిన చండీయాగం, సుదర్శన యాగాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News