Shah Rukh Khan: మెగా ఫోన్ పట్టిన బాలీవుడ్ బడా స్టార్ కుమారుడు

Shah Rukh Khan son Aryan Khan directorial debut series is titled Stardom
  • డైరెక్టర్ గా వస్తున్న షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్
  • వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభం
  • ‘స్టార్‌డమ్’ అనే టైటిల్ ఖరారు
చిత్ర పరిశ్రమలో వారసుల హవా సహజం. ముఖ్యంగా బడా స్టార్ల కుమారులు తండ్రి బాటలోనే హీరోలుగా మారుతుంటారు. కానీ, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయడు ఆర్యన్ ఖాన్ ప్రత్యేక దారి ఎంచుకున్నారు. తండ్రిలా కెమెరా ముందు కాకుండా కెమెరా వెనుక ఉండిపోవాలని నిర్ణయించుకుని, దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే సొంత దుస్తుల బ్రాండ్ ప్రారంభించి, తండ్రి నటించిన ఓ యాడ్ కు దర్శకత్వం వహించిన ఆర్యన్ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు. 

దీన్ని షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు ‘స్టార్‌డమ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫీచర్ ఫిల్మ్ కోసం ఆర్యన్ ఖాన్ స్క్రిప్ట్ రాస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తన మొదటి ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ రచనను పూర్తి చేసినట్లు ఆర్యన్ స్వయంగా ప్రకటించాడు. దీనికి అతనే డైరెక్టర్‌గా, షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. షూటింగ్ మొదలైన ఈ వెబ్ సిరీస్ లో ఆరు ఎపిసోడ్‌లు ఉంటాయని తెలుస్తోంది.
Shah Rukh Khan
Bollywood
Aryan Khan
director
web series
Stardom

More Telugu News