Sanjay Manjrekar: పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేసేది తానే అని నిరూపించాడు: సంజయ్ మంజ్రేకర్

Sanjay Manjrekar heaps praise on MI batter Tim David

  • నిన్న ఐపీఎల్ లో రాజస్థాన్ పై ముంబయి అద్భుత విజయం
  • ఆఖరి ఓవర్లో 3 సిక్స్ లు కొట్టి ముంబయిని గెలిపించిన టిమ్ డేవిడ్
  • ఒత్తిడిలో టిమ్ డేవిడ్ ప్రశాంతంగా ఆడాడన్న మంజ్రేకర్

ఐపీఎల్ లో గతరాత్రి రాజస్థాన్ రాయల్స్ పై ముంబయి ఇండియన్స్ అద్భుత విజయం సాధించడం తెలిసిందే. అందులో ముంబయి ఇండియన్స్ ఆటగాడు టిమ్ డేవిడ్ ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్ లు కొట్టి తన జట్టును గెలిపించడం క్రికెట్ అభిమానులు అంత తేలిగ్గా మరువలేరు. ఈ నేపథ్యంలో, మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. 

ముంబయి ఇండియన్స్ జట్టులో కీరన్ పొలార్డ్ ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేసేది తానే అని టిమ్ డేవిడ్ నిరూపించాడు అని మంజ్రేకర్ కితాబునిచ్చాడు. టిమ్ డేవిడ్ తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడి పనిపూర్తిచేయడం అమోఘం అని కితాబునిచ్చారు. పొలార్డ్ స్థానాన్ని అతడు తప్ప మరొకరు భర్తీ చేయలేరు అన్నట్టుగా ఆడాడని అభినందించారు. 

బంతులను పరుగులుగా మలచడం, జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడడం ద్వారా మిగతా వారి కంటే తానే మెరుగని చాటిచెప్పాడని మంజ్రేకర్ ఈ ఆసీస్ ఆల్ రౌండర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

  • Loading...

More Telugu News