Congress: పీఎఫ్ఐ మాదిరి భజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తాం: ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్

Ban on Bhajrang Dal in Karnataka Congress manifesto
  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
  • విద్వేషాలను సృష్టించే వ్యక్తులు, సంస్థలను ఉపేక్షించబోమన్న కాంగ్రెస్
  • ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
వారం రోజుల్లో (మే 10) కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరోవైపు ప్రజలను ఆకట్టుకునే హామీలతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మాదిరి విశ్వహిందూ పరిషత్ యూత్ వింగ్ అయిన భజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని తెలిపింది. ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించే భజరంగ్ దళ్ లాంటి సంస్థలన్నింటినీ నిషేధిస్తామని చెప్పింది. మతం, కులం ఆధారంగా చిచ్చు పెట్టే వ్యక్తులను కానీ, సంస్థలను కానీ ఉపేక్షించబోమని తెలిపింది. మరోవైపు గ్యారంటీ కార్డ్ పేరుతో మహిళలు, నిరుద్యోగులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీలను గుప్పించింది. 

Congress
Karnataka
Assembly Elections
Manifesto
Bhajrang Dal

More Telugu News