KTR: సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ కు నిరసన సెగ

KTR faces protest
  • ఎల్లారెడ్డిపేటలో కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు
  • అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్
  • నిరసనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పాడైపోయిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ వాహన శ్రేణికి అడ్డంగా వెళ్లారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
KTR
TRS
Protest

More Telugu News