YS Jagan: అందుకే రీజినల్ కోఆర్డినేటర్ పదవి నుండి తప్పుకున్నా: జగన్తో బాలినేని
- ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యత లేదంటూ కొంతకాలంగా అసంతృప్తి
- ముఖ్యమంత్రి సముదాయించినా ఆ పదవికి నో
- ఎన్నికలు ఎంతో దూరంలో లేనందున నియోజకవర్గంపై దృష్టి సారించాలన్న బాలినేని
ఎన్నికలు మరెంతో దూరంలో లేనందున తాను తన నియోజకవర్గంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అందుకే తను రీజినల్ కోఆర్డినేటర్ పదవి నుండి తప్పుకున్నట్లు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అధినేత జగన్ తో చెప్పినట్లుగా తెలుస్తోంది. బాలినేని ఇటీవల వైసీపీ రీజీనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత లేదంటూ ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా కలకలం రేపింది. దీంతో తాడేపల్లి రావాల్సిందిగా ఆయనకు అధినేత నుండి కబురు వచ్చింది.
మంగళవారం జగన్ తో బాలినేని భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సముదాయించినా ఆయన మెత్తబడలేదని తెలుస్తోంది. రీజినల్ కోఆర్డినేటర్ పదవిలో కొనసాగేది లేదని చెప్పినట్టు సమాచారం. అయితే తాను నియోజకవర్గంపై దృష్టి సారించాల్సిన ఉన్నందున రాజీనామా చేసినట్లుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇటీవలి వరకు నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించారు.