Sensex: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- ఎనిమిది రోజుల వరుస లాభాలకు బ్రేక్
- 161 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 58 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
వరుసగా ఎనిమిది రోజుల పాటు లాభాల జోరును కొనసాగించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నిరాశాజనకంగా ఉండటం... కీలక వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈక్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 61,193కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 18,089 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (1.42%), ఏసియన్ పెయింట్స్ (1.02%), టాటా మోటార్స్ (0.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.70%), ఐటీసీ (0.66%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-1.54%), టెక్ మహీంద్రా (-1.46%), యాక్సిస్ బ్యాంక్ (-1.22%), టీసీఎస్ (-1.21%), ఎల్ అండ్ టీ (-1.16%).