PBKS: పంజాబ్‌ కింగ్స్‌పై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. సమ ఉజ్జీల పోరులో గెలుపెవరిదో!

Mumbai Indians have won the toss and have opted to field
  • గత మ్యాచుల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న పంజాబ్, ముంబై
  • గెలుపుపై కన్నేసిన ఇరు జట్లు
  • పంజాబ్ గెలిస్తే నేరుగా రెండో స్థానానికే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మరికాసేపట్లో మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లు తమ గత మ్యాచుల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్నాయి. అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని చూస్తున్నాయి.

పాయింట్ల పట్టికలో ముంబై కంటే ఓ మెట్టు (ఆరో స్థానం) పైనున్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఏకంగా రెండో స్థానానికి ఎగబాకుతుంది. ముంబై మాత్రం ఒకటి రెండు స్థానాలు మాత్రమే మెరుగుపరుచుకోగలుగుతుంది. ఓడితే మాత్రం కిందికి దిగజారే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ముంబై జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన మెరిడిత్ స్థానంలో ఆకాశ్ మద్వాల్ జట్టులోకి వచ్చాడు. పంజాబ్ జట్టులో రబడ బెంచ్‌కు పరిమితమయ్యాడు.
PBKS
MI
Rohit Sharma
Shikhar Dhawan
Punjab
IPL 2023

More Telugu News