listeria: క్యాడ్ బరీ చాక్లెట్లలో బ్యాక్టీరియా?.. యూకేలో ఆందోళన

Cadbury recalls products in UK over fears they might cause rare but dangerous disease

  • వేలాది చాక్లెట్లను వెనక్కి తీసుకుంటున్న కంపెనీ
  • చాక్లెట్లలో లిస్టీరియా బ్యాక్టీరియా చేరిందని అనుమానం
  • గర్భిణిలు, వృద్ధులకు ప్రమాదకరం అంటున్న వైద్యులు

ప్రముఖ చాక్లెట్ తయారీ కంపెనీ క్యాడ్ బరీ మరోమారు వివాదంలో చిక్కుకుంది. యూకేలో కంపెనీ తయారుచేసిన చాక్లెట్లలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ బ్యాచ్ కు చెందిన వేలాది చాక్లెట్లను కంపెనీ వెనక్కి తీసుకుంటోంది. సూపర్ మార్కెట్లు, రిటైలర్లను అలర్ట్ చేసినట్లు వెల్లడించింది. క్యాడ్ బరీ ఉత్పత్తులను దూరంపెట్టాలని బ్రిటన్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. ఈమేరకు లండన్ కు చెందిన స్కై న్యూస్ ఓ వార్తా కథనం ప్రచురించింది.

క్యాడ్ బరీ ఉత్పత్తులు.. క్రంచీ, డైమ్, ఫ్లేక్, డైరీ మిల్క్ బటన్స్, డైరీ మిల్క్ చంక్స్, చాక్ లెట్ డిసర్ట్స్ కొనుగోలు చేసిన వారు వాటిపై ఎక్స్ పైరీ తేదీ సరిచూసుకోవాలని యూకే ఫుడ్ స్టాండర్డ్స్ హెచ్చరించింది. ఎక్స్ పైరీ డేట్ మే 17, మే 18 ఉన్న ఉత్పత్తులను తాము కొనుగోలు చేసిన చోట తిరిగిచ్చేయాలని తెలిపింది.

కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల లిస్టీరియోసిస్ ఇన్ ఫెక్షన్ సోకుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) నిపుణులు తెలిపారు. ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయని, జ్వరం, కండరాల నొప్పి, డయేరియా లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. అయితే, ఇన్ ఫెక్షన్ సోకిన వారిలో ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం కనిపించవచ్చని కూడా తెలిపారు. శరీరంలోకి చేరిన బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని తెలిపారు. వృద్ధులు.. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అరుదైన సందర్భాలలో ఈ బ్యాక్టీరియా కారణంగా గర్భం కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు.

  • Loading...

More Telugu News