Mocha: ఆగ్నేయ బంగాళాఖాతంలో 'మోచా' తుపాను

Cyclone Mocha in Southeast Bay Of Bengal
  • బంగాళాఖాతంలో తుపాను ఏర్పడేందుకు అనుకూలత
  • మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం
  • తుపానుగా మారితే 'మోచా' అని నామకరణం
  • 'మోచా' అనే పేరును సూచించిన యెమెన్ దేశం
  • అల్పపీడనం ఏర్పడ్డాక దీని గమనంపై స్పష్టత
  • మయన్మార్ వైపు వెళుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థల అంచనా
బంగాళాఖాతంలో తుపాను ఏర్పడేందుకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 6న అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుందని, ఇది క్రమేపీ బలపడి వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై తుపానుగా రూపాంతరం చెందుతుందని వివరించింది. 

తుపానుగా మారితే దీనిని 'మోచా' అని పిలుస్తారని ఐఎండీ తెలిపింది. ఈ పేరును యెమెన్ దేశం సూచించినట్టు వెల్లడించింది. యెమెన్ లోని ఓ ఓడరేవు నగరం పేరు మీదుగా 'మోచా' అని నామకరణం చేసినట్టు వివరించింది. 


భారత్ లోని తూర్పు తీర రాష్ట్రాలకు దీని వల్ల ముప్పు ఉందని చెబుతున్నప్పటికీ, ప్రస్తుతానికి ఈ తుపానుపై ఐఎండీ వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేదు. అల్పపీడనం ఏర్పడ్డాక దీని గమనంపై ఓ అంచనాకు రానున్నారు. 

కాగా, మోచా తుపాను ఈశాన్య దిశగా పయనించి మయన్మార్ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని ఓ ప్రైవేటు వాతావరణ సంస్థ మోడల్స్ సూచిస్తున్నాయి.
Mocha
Cyclone
Bay Of Bengal
India
Myanmar

More Telugu News