SSC: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక దరఖాస్తులకు గడువు పొడిగింపు

SSC extends application timeline for Combined Graduate Level exam
  • కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షకు మే 3తో ముగిసిన రిజిస్ట్రేషన్లు
  • మే 5వ తేదీ రాత్రి 11 గంటల వరకు పొడిగింపు
  • ఎస్ఎస్ సీ తాజా ప్రకటన
గ్రూప్-బి, గ్రూప్-సి కేటగిరీల్లో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. డిగ్రీ విద్యార్హతతో మొత్తం 7,500 పోస్టులకు భారీ ప్రకటన ఇచ్చింది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక దరఖాస్తులకు గడువును ఎస్ఎస్ సీ పొడిగించింది. 

వాస్తవానికి షెడ్యూల్ లో పేర్కొన్న ప్రకారం మే 3 తేదీతో దరఖాస్తులకు గడువు ముగిసింది. ఈ గడువును మే 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఎస్ఎస్ సీ తాజా ప్రకటన చేసింది. మే 5వ తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. 

ఆన్ లైన్ లో ఫీజు చెల్లించేందుకే మే 6వ తేదీ రాత్రి 11 గంటల వరకు అవకాశం ఉంది. దరఖాస్తుల్లో పొరబాట్లను సరిదిద్దేందుకు మే 10 నుంచి 11 వరకు అవకాశం కల్పించారు. వివరాలకు ఎస్ఎస్ సీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
SSC
CGL
Applications
India

More Telugu News