Telangana: జవాను అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి కేటీఆర్

KTR CONDOLES OVER ARMY JAWAN ANIL DEATH

  • జమ్మూ కశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన అనిల్ మృతి
  • 11 ఏళ్లుగా ఆర్మీలో టెక్నీషియన్ గా పని చేస్తున్న అనిల్
  • తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, ఎంపీ బండి సంజయ్

జమ్మూ కశ్మీర్ లో నిన్న జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాను పబ్బల అనిల్ మృతి చెందారు. ఆర్మీలో టెక్నిషియన్ గా పని చేస్తున్న అనిల్ మరణవార్తతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనిల్ కు భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 45 రోజుల సెలవుపై స్వగ్రామానికి వచ్చిన అనిల్ పది రోజుల క్రితమే తిరిగి విధుల్లో చేరారు. ఇంతలోనే ఆయన మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

జవాన్ అనిల్ మృతి పట్ల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్‌ని కోల్పోవడం బాధాకరమన్న కేటీఆర్.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జవాను మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బండి సంజయ్ .. అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.. అక్కడే ఉన్న జిల్లా నేతలతో మాట్లాడారు. అనిల్ అంతిమ సంస్కార ఏర్పాట్లతోపాటు తదుపరి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News