surya kumar yadav: సూర్య బ్యాటర్ మాత్రమే కాదు.. గణిత శాస్త్రజ్ఞుడు.. లెక్కలేసుకుని మరీ కొడతాడు: శ్రీశాంత్ ప్రశంసలు

even sky is not the limit for mathematician surya says sreesanth
  • గణిత శాస్త్రజ్ఞుడిలా ఫీల్డ్ ను సూర్య లెక్కిస్తాడన్న శ్రీశాంత్
  • ఫీల్డర్ ఎక్కడ ఉన్నాడో, గ్యాప్ ఎక్కడ ఉందో అతనికి తెలుసని వ్యాఖ్య
  • ఈ ‘స్కై’కి హద్దే లేదన్న మాజీ క్రికెటర్
ఐపీఎల్ లో వరుసగా రెండు సార్లు 200 టార్గెట్ ను ఛేదించిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది. తొలుత రాజస్థాన్ ను, తర్వాత పంజాబ్ ను ఓడించింది. ఈ రెండు విజయాల్లోనూ సూర్య కుమార్ యాదవ్ ది కీలక పాత్ర. రెండు హాఫ్ సెంచరీలతో తన టీమ్ గెలుపునకు బాటలు వేశాడు.

ప్రస్తుతం టీ20ల్లో నంబర్ వన్ గా ఉన్న ‘360 డిగ్రీస్’ సూర్యపై మాజీ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానంలో గ్యాప్ లు చూసి బౌండరీలు కొట్టే ‘గణిత శాస్త్రజ్ఞుడు’ అని వ్యాఖ్యానించాడు.  

స్టార్ స్పోర్ట్స్ తో శ్రీశాంత్ మాట్లాడుతూ.. ‘‘స్కై (సూర్య) కేవలం బ్యాటర్ మాత్రమే కాదు.. గణిత శాస్త్రజ్ఞుడు. గణిత శాస్త్రజ్ఞుడిలా ఫీల్డ్ ను లెక్కిస్తాడు. ఆ లెక్కలను తన మనస్సులో పొందుపరుచుకుంటాడు. మైదానం పరిమాణం, బౌలర్ పేస్.. వంటి వాటిని అంచనా వేస్తాడు. ఫీల్డర్ ఎక్కడ ఉన్నాడో, గ్యాప్ ఎక్కడ ఉందో అతనికి తెలుసు. అతను చాలా కచ్చితమైనవాడు. అందరూ 'ఆకాశమే హద్దు' అంటారు కానీ సూర్యకి హద్దే లేదు’’ అని పొగడ్తలు కురిపించాడు.

ముంబై ఇండియన్స్ జట్టు గెలుపు ట్రాక్ ఎక్కిందని, ఇక ఆపడం కష్టమని అన్నాడు. ‘‘ముంబై జట్టు ఒక్కసారి విజయం రుచి చూసిందంటే.. ఇక ఆగదు. విజయాల్లో వారికి పెద్ద చరిత్రే ఉంది. గతంలో ఎన్నో చేశారు.. వాటిని పునరావృతం చేయగలరు కూడా’’ అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
surya kumar yadav
sreesanth
mathematician
SKY
Mumbai

More Telugu News