Ravinder Gupta: తెలంగాణ వర్సిటీలో రాజకీయాలు చేస్తున్నారు: వీసీ రవీందర్ గుప్తా
- విద్యాశాఖ కమిషనర్ పై వీసీ ఫైర్
- తనపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారన్న రవీందర్ గుప్తా
- సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాజకీయాలు చేస్తున్నారని వైస్ చాన్సలర్ రవీందర్ గుప్తా మండిపడ్డారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా తను చెప్పిన వ్యక్తే ఉండాలని విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఎత్తుగడలను తాను వ్యతిరేకించడంతో, కావాలనే తనపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. రూ.20 కోట్ల 'రూసా' నిధులు ఇవ్వకుండా నవీన్ మిట్టల్ అడ్డుకుంటున్నారని వీసీ రవీందర్ గుప్తా వెల్లడించారు.
దొడ్డిదారిన తన పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఏ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. వర్సిటీ పాలనా వ్యవహారాల్లో నవీన్ మిట్టల్ జోక్యంపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని వీసీ రవీందర్ గుప్తా కోరారు.