Samsung: శామ్ సంగ్ గెలాక్సీ ఎం 14, ఎస్ 21 ఎఫ్ఈ ధరలపై భారీ తగ్గింపు

Samsung Galaxy M14 5G and Galaxy S21 FE get massive price cut in India
  • గెలాక్సీ ఎం 14 5జీ కేవలం రూ.12,490కే లభ్యం
  • గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈపై మరింత డిస్కౌంట్
  • రూ.49,990కు విడుదలైన ఈ ఫోన్ రూ.25,990కే అందుబాటు
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు వేసవి సందర్భంగా ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాన్ని చేపట్టాయి. అమెజాన్ అయితే గ్రేట్ సమ్మర్ సేల్ ను ఈ నెల 8 వరకు నిర్వహిస్తోంది. ఫ్లిప్ కార్ట్ అయితే బిగ్ సేవింగ్ డేస్ కార్యక్రమాన్ని ఈ నెల 10 వరకు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శామ్ సంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎం14 5జీ, ఎస్21 ఎఫ్ఈ మోడళ్ల ధరలపై భారీ తగ్గింపు ఆఫర్లు నడుస్తున్నాయి.

గెలాక్సీ ఎం14 5జీ ధర వాస్తవంగా రూ.14,990. కానీ, దీన్ని అమెజాన్ లో రూ.13 వేల కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. 128 జీబీ స్టోరేజీ వేరియంట్ అమెజాన్ లో రూ.13,990కు అమ్మకానికి పెట్టారు. హెచ్ డీఎఫ్ సీ కార్డుతో కొనుగోలు చేస్తే దీనిపై రూ.1,500 తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు నికరంగా పడే ధర రూ.12,490. ఈ ధరకు ఇది మంచి డీల్ అవుతుంది. 

ఇక గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ ఫోన్ ను గతేడాది శామ్ సంగ్ రూ.49,999 ధరపై విడుదల చేసింది. దాన్ని ఇప్పుడు ప్రత్యేక సేల్ లో భాగంగా రూ.26,990కే అమెజాన్ విక్రయిస్తోంది. ఐసీఐసీఐ, కోటక్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో రూ.1,000 తగ్గింపు వస్తుంది. నిజానికి ఈ ధరకు ఇది ‘వ్యాల్యూ ఫర్ మనీ’ ఆని చెప్పుకోవచ్చు. వీటితోపాటు స్మార్ట్ ఫోన్లపై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరెన్నో ఆఫర్లు ఇస్తున్నాయి.
Samsung
Galaxy M14 5G
Galaxy S21 FE
huge discount
amazon
flipkart

More Telugu News