Congress: ఖర్గేను చంపాలని చూస్తున్నారు.. బీజేపీపై రణ్ దీప్ సూర్జేవాలా సంచలన ఆరోపణ

BJP Plotting To Murder Mallikarjun Kharge And Family Claims Congress
  • చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి రాథోడ్ ఈ కుట్ర పన్నారని వెల్లడి
  • రాథోడ్ మాట్లాడిన ఆడియో క్లిప్ లభ్యమైందని వివరణ
  • ప్రియాంక్ ఖర్గేపై పోటీపడుతున్న మణికంఠ రాథోడ్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, ఆయన కుటుంబాన్ని చంపాలని బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పై చూపుతున్న ప్రేమను తట్టుకోలేక ఈ నీచానికి దిగజారారని మండిపడ్డారు. ఈమేరకు బీజేపీ నేత, చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్న మణికంఠ రాథోడ్ మాట్లాడిన ఆడియో క్లిప్ తమకు లభించిందని సూర్జేవాలా చెప్పారు. ఖర్గేను ఆయన కుటుంబం మొత్తాన్నీ తుదముట్టించాలని గుర్తుతెలియని వ్యక్తితో రాథోడ్ చర్చించారని అన్నారు.

చిత్తాపూర్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తున్నారు. ప్రియాంక్ ఖర్గే బరిలో ఉండడంతో తాను ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని రాథోడ్ కు అర్థమైందని సూర్జేవాలా మీడియాకు చెప్పారు. దీంతో ప్రియాంక్ పై ద్వేషం పెంచుకుని హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు రాజకీయంగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కన్నడ ప్రజలు తమ పార్టీపై చూపిస్తున్న ప్రేమను బీజేపీ నేతలు తట్టుకోలేక పోతున్నారని సూర్జేవాలా ఆరోపించారు.
Congress
Kharge
murder plot
Mallikarjun Kharge
surgewala

More Telugu News