bajarang dal: మేనిఫెస్టో రగడ... రూ.100 కోట్ల పరిహారం కోరుతూ ఖర్గేకు వీహెచ్‌పీ లీగల్ నోటీసులు

VHP sends Rs 100 cr notice to Kharge for defaming Bajrang Dal

  • అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టో
  • 14 రోజల్లో పరిహారం చెల్లించాలని చండీగఢ్ యూనిట్ నోటీసులు
  • మే 4న పంపిన నోటీసులకు కాంగ్రెస్ నుండి రాని సమాధానం

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌పై నిషేదం విధిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. తాజాగా బజరంగ్ దళ్ పరువు నష్టం కలిగేలా వ్యాఖ్యానించారని చెబుతూ రూ.100 కోట్ల పరిహారం కోరుతూ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు... కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లీగల్ నోటీసులు పంపించారు.

14 రోజుల్లోగా పరిహారం చెల్లించాలని కోరుతూ వీహెచ్‌పీ చండీగఢ్ యూనిట్, దాని యువజన విభాగం బజరంగ్ దళ్ మే 4న నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులకు కాంగ్రెస్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పీఎఫ్ఐ మాదిరి బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని చేసిన కాంగ్రెస్ ప్రకటనను బీజేపీ ఎన్నికల ప్రచారానికి అనుకూలంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు విశ్వహిందూ పరిషత్ ఏకంగా పరువు నష్టం అంటూ లీగల్ నోటీసులు పంపించింది.

  • Loading...

More Telugu News