China: ఫోన్లో అదే పనిగా మాట్లాడుతుంటారా?.. అయితే మీకు ఈ ముప్పు తప్పదు!

China Researchers said mobile phone using long time cause to High BP

  • ప్రపంచ వ్యాప్తంగా పదేళ్లు దాటిన వారిలో మూడొంతుల మంది దగ్గర మొబైల్ ఫోన్లు
  • తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తిని వెలువరించే ఫోన్లు
  • వీటికి ఎక్కువ సేపు గురైతే బీపీ పెరుగుతుందన్న చైనా పరిశోధకులు
  • గుండెపోటు, పక్షవాతానికి బీపీనే కారణం

మొబైల్ ఫోన్లు ప్రవేశించిన కొత్తలో నిమిషానికి ఇంత, సెకనుకు ఇంత అని ప్రతీ కాల్‌కు టెలికం కంపెనీలు డబ్బులు వసూలు చేసేవి. ఈ రంగంలోకి రిలయన్స్ ప్రవేశించిన తర్వాత అది రివల్యూషన్‌కు దారితీసింది. నెలకు ఇంత చెల్లించండి.. ఎంతసేపైనా మాట్లాడుకోండి అని విప్లవం తీసుకొచ్చింది. మాట్లాడుతూ వాచీ వంక చూసుకునే పని లేకపోవడంతో అయినదానికి, కాని దానికి ఫోన్లు ఎక్కువయ్యాయి. అయితే, అతి ఎప్పుడూ ప్రమాదమే. గంటల తరబడి ఫోన్లు  మాట్లాడితే అధిక రక్తపోటు ముప్పు తప్పదని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

వారానికి అరగంటకు మించి ఫోన్‌లో మాట్లాడే వారికి హైబీపీ 12 శాతం పెరగొచ్చని పరిశోధకులు తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పదేళ్ల వయసు పైబడిన వారిలో దాదాపు మూడొంతుల మంది మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఇవి తక్కువ స్థాయిలో రేడియో ఫ్రీక్వెన్సీ శక్తిని వెలువరిస్తాయి. వీటికి ఎక్కువసేపు గురైతే బీపీ పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. గుండెపోటు, పక్షవాతానికి అధిక రక్తపోటే కారణమని, వీటివల్లే ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అకాల మరణాల బారినపడుతున్నారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

బ్రిటన్‌లోని బయోబ్యాంకు నుంచి 37 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య వయసున్న రెండు లక్షల మందికి సంబంధించిన డేటాను పరిశీలించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. వీరంతా మొబైల్ ఫోన్లలో ఎంతసేపు మాట్లాడతారో తెలుసుకున్న పరిశోధకులు 12 ఏళ్ల తర్వాత వారిని మళ్లీ పరిశీలించినప్పుడు 7 శాతం మందిలో అధిక రక్తపోటును గుర్తించారు. వారానికి అరగంట పాటు మాట్లాడేవారికి 12 శాతం, 30 నుంచి 59 నిమిషాలపాటు మాట్లాడేవారికి 13 శాతం, గంట నుంచి 3 గంటల మధ్య మాట్లాడేవారికి 16 శాతం మేర అధిక రక్తపోటు పెరగవచ్చని తమ పరిశోధనలో తేలినట్టు చైనా శాస్త్రవేత్తలు వివరించారు.

  • Loading...

More Telugu News