Junior NTR: ఓటీటీ షోకు హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్?

Junior NTR to host OTT Talk Show
  • ఈటీవీ విన్ ఓటీటీ ఛానల్ లో టాక్ షో
  • ఎన్టీఆర్ ను ఈటీవీ ప్రతినిధులు సంప్రదించారని ప్రచారం
  • హోస్ట్ గా చేయడానికి తారక్ ఓకే చెప్పాడని సమాచారం
'ఆర్ఆర్ఆర్' సూపర్ హిట్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. డైరెక్ట్ బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు తారక్ రెడీ అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తో యంగ్ టైగర్ బిజీగా ఉన్నాడు. మరోవైపు తారక్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఒక ఓటీటీ షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడనేదే ఆ వార్త. ఈటీవీ విన్ ఓటీటీ ఛానల్ లో ఈ షో ప్రసారం అవుతుందని సమాచారం. ఈ షోను హోస్ట్ చేయాలని కోరుతూ ఈటీవీ ప్రతినిధులు తారక్ ను సంప్రదించారని చెపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Junior NTR
Tollywood
OTT
Talk Show
ETV Win

More Telugu News