Chandrababu: యువతను గంజాయి హంతకులను చేస్తున్నా ఎందుకీ ఉదాసీనత?: చంద్రబాబు

Chandra babu questions ap government lack of action on Ganja issue in the state

  • విజయవాడ సమీపంలో గంజాయి కారణంగా తలెత్తిన వివాదంలో యువకుడి హత్య
  • గంజాయి వాడవాడలా విస్తరిస్తోందన్న బాబు 
  • ప్రభుత్వ ఉదాసీనతతో ఈ మహమ్మారి మన బిడ్డల వరకూ వస్తుందని హెచ్చరిక
  • పక్కా ప్రణాళికతో సమస్యపై ఉక్కుపాదం మోపాలని సూచన

గంజాయి కారణంగా విజయవాడలో జరిగిన గొడవలో అజయ్ సాయ్ అనే యువకుడు మరణించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. వాడవాడలా విస్తరిస్తున్న గంజాయి పీడపై ఏపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబిస్తోందని ప్రశ్నించారు.  

‘‘ఏపీలో విచ్చలవిడి గంజాయి వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేయడమే కాదు, ఏకంగా ప్రాణాలను కూడా తీస్తోంది. విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడి ప్రాణాలు తీసింది. మరో ఐదుగురిని హంతకులను చేసింది. దీనికి ఈ ప్రభుత్వ సమాధానం ఏంటి? వాడవాడలా విస్తరిస్తున్న గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకు? ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోరా? ఈ ఉదాసీనత వల్ల గంజాయి మహమ్మారి మన బిడ్డల వరకు వస్తుంది అని మర్చిపోకండి. పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపండి’’ అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News