Depression: ఈ సాయంత్రానికి బంగాళాఖాతంలో వాయుగుండం

 Depression may form in Bay of Bengal this evening

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
  • ఇది మరింత పుంజుకుంటోందన్న ఐఎండీ
  • రేపటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను
  • మే 11 వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనం
  • క్రమేపీ దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనం
  • బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వద్ద భూభాగంపైకి ప్రవేశించే అవకాశం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ సముద్రాన్ని ఆనుకుని నిన్న ఏర్పడిన అల్పపీడనం, ఈ ఉదయానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నేటి సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఆ తర్వాత మరింత పుంజుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి రేపు (మే 10) తుపానుగా రూపాంతరం చెందుతుందని వెల్లడించింది. 

ఈ తుపాను (మోచా) మే 11వ తేదీ వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని, అక్కడ్నించి క్రమేపీ దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ వివరించింది.

  • Loading...

More Telugu News