Telangana: నేడు తెలంగాణ ‘పది’ ఫలితాలు.. సత్తా చాటేదెవరో!

Telangana 10th Results Today

  • నేటి మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • ఉట్నూరులో 9 మంది విద్యార్థుల తెలుగు పరీక్ష జవాబు పత్రాల గల్లంతు
  • అంతర్గత మార్కుల ఆధారంగా పాస్ చేసిన అధికారులు!

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేస్తారు. 

ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 4,84,370 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 9 మంది విద్యార్థుల తెలుగు పరీక్ష జవాబు పత్రాల బండిల్  కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుని వారిని పాస్ చేసినట్టు సమాచారం.

కాగా, విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే ప్రతిభ కనబరించారు. మరి ‘పది’లో పైచేయి ఎవరిదో చూడాల్సిందే.

  • Loading...

More Telugu News