Twitter: ట్విట్టర్ లో ఇకపై ఫోన్ కూడా చేసుకోవచ్చు !

Elon Musk Says Twitter Will Soon Get New Features Like Voice and Video Calls
  • ఫోన్ కాల్ సదుపాయం త్వరలో అందుబాటులోకి తెస్తామన్న ఎలాన్ మస్క్
  • ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ సౌకర్యం కూడా ఉంటుందని వెల్లడి
  • సరికొత్త ఫీచర్లతో ట్విట్టర్ ను తీర్చిదిద్దుతున్నట్లు వివరణ
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ సదుపాయం ద్వారా ప్రపంచంలోని ఎవరితోనైనా నేరుగా మాట్లాడవచ్చని చెప్పారు. అంతేకాదు.. వాట్సాప్ తరహాలో ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ సదుపాయం కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ట్విట్టర్ యూజర్లు నేరుగా సందేశాలు (డైరెక్ట్ మెసేజెస్) పంపించుకోవచ్చని వివరించారు.

ట్విట్టర్ ఫోన్ కాల్ సౌకర్యంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారితో అయినా నేరుగా మాట్లాడే అవకాశం కలుగుతుందని ఎలాన్ మస్క్ చెప్పారు. వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చని అన్నారు. దీనివల్ల అవతలి వ్యక్తికి మీ ఫోన్ నెంబర్ తెలియకుండా జాగ్రత్త పడే వీలు కలుగుతుందని వివరించారు. సరికొత్త ఫీచర్లతో ట్విట్టర్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నట్లు మస్క్ తెలిపారు. అయితే, ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ ల తరహాలో ఫోన్ కాల్స్ కూడా ఎన్ క్రిప్టెడ్ అవునా కాదా అనే విషయాన్ని మాత్రం మస్క్ వెల్లడించలేదు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ఇన్ స్టాలలో ఫోన్ కాల్ సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది.
Twitter
New Features
Voice and Video Calls
Elon Musk
Twitter Phone call

More Telugu News