Jio Dive: జియో తెచ్చిన ఈ గ్యాడ్జెట్ తో మైదానంలో ఉన్నట్టుగానే మ్యాచులు చూడొచ్చు

Jio launches Jio Dive VR headset for IPL fans at Rs 1299

  • వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ ను విడుదల చేసిన జియో
  • దీని ధర కేవలం రూ.1,299
  • జియో యూజర్లకే ఇది ప్రత్యేకం
  • 100 అంగుళాల సైజులో 360 డిగ్రీల కోణంలో చూసే అవకాశం

ఐపీఎల్ లీగ్ దశలో క్రికెట్ మ్యాచులు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఏ జట్టూ తగ్గేదేలా అన్నట్టు గట్టి పోటీనిస్తున్నాయి. ఐపీఎల్ స్టేడియాలు క్రికెట్ అభిమానులతో భారీగా కిటకిటలాడుతున్నాయి. ఐపీఎల్ మ్యాచును మైదానంలో ఉండి చూడాలని ఎవరికైనా ఉంటుంది. కాకపోతే అందరికీ సాధ్యపడదు. అయితే, రిలయన్స్ జియో తీసుకొచ్చిన వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్ సెట్ ‘జియో డైవ్’ను కొనుక్కుంటే అచ్చం మైదానంలో ఉన్నట్టుగానే మ్యాచ్ వీక్షించొచ్చు. ఇది నిజంగా ఐపీఎల్ అభిమానులకు సంతోషకరమైనదే.

ఇది వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లను జియో సినిమాస్ ప్రసారం చేస్తుండడం తెలిసిందే. జియో కస్టమర్లు అందరూ జియో సినిమాస్ యాప్ నుంచి ఉచితంగా ఐపీఎల్ మ్యాచులను వీక్షించే అవకాశం ఉంది. ఈ వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ కొనుక్కుని కళ్లకు పెట్టుకుంటే చాలు.. చూస్తున్నది జియో సినిమాలో అయినా.. మైదానంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.

ఈ వీఆర్ హెడ్ సెట్ ప్రత్యేకత ఏమిటంటే.. 100 అంగుళాల తెరపై 360 డిగ్రీల కోణంలో మ్యాచ్ ను వీక్షించొచ్చు. జియో యూజర్లకే ఈ వీఆర్ హెడ్ సెట్ ప్రత్యేకం. దీని ధర కూడా చాలా తక్కువ. కేవలం రూ.1,299. జియోమార్ట్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పేటీఎం వ్యాలెట్ నుంచి కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ కూడా ఉంది. 4.7 అంగుళాలు అంతకంటే పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్లకు ఇది అనుకూలం.

  • Loading...

More Telugu News