Jr NTR: ఎన్టీఆర్‌కి జోడీగా మరో బాలీవుడ్ హీరోయిన్

Tarak to romance with Shraddha kapoor in prashanth neel movie
  • ప్రశాంత్ నీల్ తో సినిమాకు ఓకే చెప్పిన తారక్
  • అందులో హీరోయిన్ గా నటించనున్న శ్రద్దా కపూర్  
  • ప్రస్తుతం జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాలతో తారక్ సినిమా
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌‌ గా మారిపోయారు. ఆ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన తారక్ తో సినిమాలు తీసేందుకు భారత్ తో పాటు హాలీవుడ్ లోని దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అలనాటి అందాల సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కానుంది. 

ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ 1, 2తో ఇండియా టాప్ డైరెక్టర్లతో ఒకరిగా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు తారక్ ఒప్పుకున్నారు. నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ తీస్తున్నారు. ఇటు సలార్, అటు కొరటాలతో తారక్ సినిమా పూర్తవగానే.. నీల్, ఎన్టీఆర్ చిత్రం పట్టాలపైకి వెళ్లనుంది. ఈ చిత్రం గురించి ఇప్పుడు ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ప్యాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. సాహోతో టాలీవుడ్ కు దగ్గరైన శ్రద్దా కపూర్. ఆమెకు కథ వినిపించినట్టు తెలుస్తోంది. ఒకవేళ శ్రద్ద హీరోయిన్ గా ఖరారైతే మరో క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకులను అలరించనుంది.
Jr NTR
Tarak
Shraddha Kapoor
Prashanth Neel

More Telugu News