Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే
- అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు
- 179 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 49 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ఒడిదుడుకులకు గురైనప్పటికీ చివరకు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడి 61,940కి పెరిగింది. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 18,315 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.84), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.), బజాజ్ ఫైనాన్స్ (1.24), టాటా మోటార్స్ (1.17), రిలయన్స్ (0.69).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-0.59), సన్ ఫార్మా (-0.41), టాటా స్టీల్ (-0.32), ఎల్ అండ్ టీ (-0.30), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.24)