Karnataka: ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఎగ్జిట్ పోల్స్!
- విడుదలైన ఎగ్జిట్ పోల్స్
- కాంగ్రెస్‌కు 107 నుంచి 119 మధ్య సీట్లు రావచ్చని అంచనా
- బీజేపికి 78-90 సీట్లు, జేడీఎస్‌కు 23-29
- మళ్లీ ‘హంగ్’ తప్పదన్న అంచనాలు
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ సంచలనం కలిగిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు 107 నుంచి 119 సీట్లు రావచ్చని తేల్చింది. బీజేపీకి 78 నుంచి 90 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. కింగ్ మేకర్ అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్న జేడీఎస్‌కు 23 నుంచి 29 వరకూ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతరులకు 1 నుంచి 3 సీట్లు రావచ్చని అంచనా.
ఇప్పటివరకూ విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో అధిక శాతం కాంగ్రెస్ ముందంజలో ఉంటుందని తేల్చి చెప్పాయి. జనతాదళ్ సెక్యులర్ నేత హెడీ కుమారస్వామి కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం మెండుగా ఉన్నట్టు ఫలితాల్లో తేలింది. మొత్తం 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 113.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు:
పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్ 107 -119, బీజేపీ 78-90, జేడీఎస్ 23-29, ఇతరులు 1-3
సువర్ణ న్యూస్-జన్ కీ బాత్: కాంగ్రెస్ 91-106, బీజేపీ 94-117, జేడీఎస్ 14-24, ఇతరులు 0-2
న్యూస్ నేషన్-సీజీఎస్: కాంగ్రెస్-86, బీజేపీ-114, జేడీఎస్-21, ఇతరులు-3
టీవీ9 భరత్‌వర్ష్-పోల్‌స్ట్రాట్: కాంగ్రెస్ 99-109, బీజేపీ 88-98, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4
రిపబ్లిక్ టీవీ-పీ మార్క్యూ: కాంగ్రెస్ 94-108, బీజేపీ 85-100, జేడీఎస్ 24-32, ఇతరులు 2-6
జీ న్యూస్-మ్యాట్రిజ్: కాంగ్రెస్ 103-118, బీజేపీ 79-94, జేడీఎస్ 25-33, ఇతరులు 2-5
ఏబీపీ-సీఓటర్: బీజేపీ 66-86, కాంగ్రెస్ 81-101, జేడీఎస్ 20-27, ఇతరులు 0-3
పోల్ ఆఫ్ పోల్స్: కాంగ్రెస్ 103, బీజేపీ 94