Chandrababu: రైతు పోరు బాట కోసం ఇరగవరం బయల్దేరిన చంద్రబాబు

TDP Supremo Chandrababu leaves to Eragavaram
  • ఈ నెల 12న టీడీపీ రైతు పోరు బాట 
  • పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో పాదయాత్ర
  • అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు
  • ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీడీపీ రైతు పోరు బాట 
  • ఈ రాత్రికి ఇరగవరంలోనే బస చేయనున్న చంద్రబాబు
అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల కోసం పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో నిర్వహించనున్న రైతు పోరు బాట కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇరగవరం బయల్దేరారు. ఇరగవరంలో ఈ సాయంత్రం చంద్రబాబు రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ రాత్రికి ఆయన ఇరగవరంలోనే బస చేస్తారు. 

రేపు ఉదయం మద్ది ఆంజనేయస్వామి ఆలయం నుంచి రైతు పోరు బాట పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తణుకు నియోజకవర్గంలో మొత్తం 12 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర సాగనుంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరినికి నిరసనగా ఇరగవరం నుంచి తణుకు వై జంక్షన్ వరకు పాదయాత్ర జరపనున్నారు.
Chandrababu
Rythu Poru Bata
Padayatra
Eragavaram
West Godavari District
Tanuku
TDP
Andhra Pradesh

More Telugu News