Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై చరణ్ ఆసక్తికర ట్వీట్

Loved this massy glimpse of Ustaad Bhagat Singh tweets Ram charan
  • హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ మాస్ ఎంటర్ టైనర్
  • మొన్న ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసిన  చిత్ర బృందం
  • గ్లింప్స్ అద్భుతంగా ఉందంటూ చరణ్ కితాబు
గతానికి భిన్నంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాటి షూటింగ్ పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు. పదకొండేళ్ల కిందట వచ్చిన ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నారు. పవన్ సరసన యువ నటి శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ చిత్రంలో పవన్ పవర్ పుల్ పోలీసాఫీర్ పాత్రలో నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ విడుదలై 11 ఏళ్లు అయిన సందర్భంగా గురువారం పవన్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 

ఇందులో పవన్ పెర్ఫామెన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా అద్భుతంగా ఉందని కితాబునిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం గ్లింప్స్ సూపర్ అంటూ ట్వీట్ చేశారు. ‘ఈ మాస్ గ్లింప్స్ నాకు తెగ నచ్చేసింది. ఈ మాస్ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో చూసేందుకు ఇక ఆగలేను’ అని ఈ రోజు ట్వీట్ చేశారు. బాబాయ్ సినిమాకు సపోర్ట్ గా చెర్రీ ట్వీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ తో సూపర్ సక్సెస్ అందుకున్న చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాతో ముందుకు రాబోతున్నారు.
Ustaad Bhagat Singh
Pawan Kalyan
Ramcharan
glimpse
tweet

More Telugu News