Haryana: భారీ కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగులకు మద్యం!
- హరియాణాలో కొత్త మద్యం పాలసీ
- కనీసం 5 వేల మంది ఉద్యోగులున్న కార్పొరేట్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బీర్, వైన్ సరఫరాకు అనుమతి
- కార్యాలయం విస్తీర్ణం లక్ష చదరపు అడుగులు ఉండాలని మరో నిబంధన
- ఆల్కహాల్ శాతం తక్కువగా వుండే వైన్, బీర్ సరఫరా చేయాలని నియమం
- ఏటా రూ. 10 లక్షలు లైసెన్స్ ఫీజు
భారీ కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగులు తక్కువ స్థాయిలో ఆల్కహాల్ కంటెంట్ ఉన్న బీర్, వైన్ తాగొచ్చని హరియాణా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు హరియాణా మంత్రి మండలి ఇటీవల కొత్త మద్యం పాలసీని ప్రకటించింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కార్పొరేట్ ఆఫీసులు ముందుగా ఎల్-10 పేరిట లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. కనీసం 5 వేల మంది ఉద్యోగులతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలోని కార్యాలయాల్లో మాత్రమే ఉద్యోగులకు మద్యం సరఫరా చేయచ్చు. ఎక్సైస్ టాక్సేషన్ కమిషనర్ అనుమతి అనంతరం కలెక్టర్ ఈ లైసెన్స్ జారీ చేస్తారు. ఈ లైసెన్స్ కోసం ఏటా రూ.10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది.