Dulquer Salmaan: వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్ ప్యాన్ ఇండియా సినిమా

Dulquer Salmaan next is a Pan India film directed by Venky Atluri
  • సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం  
  • ధనుష్ తో ‘సర్’ సినిమాతో ఆకట్టుకున్న వెంకీ
  • మహానటి, సీతారామంతో టాలీవుడ్ కు చేరువైన దుల్కర్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కు దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోవైపు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి.. ధనుష్ తో 'సర్' సినిమా తెలుగు, తమిళ ద్విభాషల్లో తీసి విజయం సాధించాడు. ఇప్పుడు వెంకీ అట్లూరి, దుల్కర్ కాంబినేషన్ లో ఓ ప్యాన్ ఇండియా చిత్రం రాబోతోంది. 

సర్ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్  సంస్థలు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానుంది. 2024 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Dulquer Salmaan
Venky Atluri
Pan India
movie

More Telugu News