Melkote: హీరోగా ట్రై చేయమని త్రివిక్రమ్ గారితో చెప్పాను: సీనియర్ నటుడు శంకర్ మెల్కొటే!

Shankar Melkote Interview

  • 'పైలా పచ్చీసు'లో అలా ఛాన్స్ వచ్చిందన్న మెల్కొటే 
  • అదే బ్యానర్లో వచ్చిన 'నువ్వే కావాలి'తో మంచి గుర్తింపు వచ్చిందని వెల్లడి  
  •  ఆ సినిమా సమయంలో త్రివిక్రంతో పరిచయమైందని వివరణ 
  • అప్పట్లో అతను హాండ్సమ్ గా ఉండేవాడని వ్యాఖ్య


తెలుగు తెరపై విభిన్నమైన డైలాగ్ డెలివరీతో నవ్వులు పూయించిన నటులలో శంకర్ మెల్కొటే ఒకరు. ఒక వైపున జాబ్ చేస్తూనే .. మరో వైపున తన మార్క్ హాస్యాన్ని పండించినవారాయన. తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ ను గురించిన విషయాలను పంచుకున్నారు. 

రామోజీరావుగారి నిర్మాణంలో నాకు 'పైలా పచ్చీసు' చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా షూటింగు మొత్తం పూర్తయిన తరువాత కామెడీ పాళ్లు కాస్త తగ్గాయని భావించి, నా కాంబినేషన్లో ఒక సీన్ ను షూట్ చేశారు. అలా ఆ సినిమా నుంచి నాకు మరింత గుర్తింపు వచ్చింది. ఆ తరువాత అదే బ్యానర్లో 'నువ్వే కావాలి' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో కోవై సరళ జోడీగా నేను చేసిన కామెడీకి మంచి పేరు వచ్చింది" అని అన్నారు. 

'నువ్వేకావాలి' సినిమా సమయంలోనే డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ గారిని నాకు విజయ్ భాస్కర్ గారు పరిచయం చేశారు. అప్పుడు త్రివిక్రమ్ గారు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు .. కెమెరా వెనక ఉండిపోవడం ఎందుకు? హీరోగా కెమెరా ముందుకు రండి" అన్నాను నేను. అందుకు ఆయన నవ్వేసి ఊరుకున్నారు. ఇప్పుడు ఆయన గొప్ప డైరెక్టర్ కూడా" అంటూ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News