Telly: ప్రకటనలు చూస్తే టీవీ ఉచితం.. కువైట్ కంపెనీ ఆఫర్

Telly will give you a free TV if youll watch non stop ads

  • కువైట్ కు చెందిన టెల్లీ టీవీ వినూత్నమైన ఆలోచన
  • టీవీ కొన్న వారికి ఉచితంగా అదనపు డిస్ ప్లే
  • అందులో నిరాటంకంగా వాణిజ్య ప్రకటనలు
  • అలాగే, వాతావరణం వివరాలు

టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కువైట్ కు చెందిన టెల్లీ టీవీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థ ఒక్క డాలర్ కూడా తీసుకోకుండా ఉచితంగా టీవీలను ఇస్తామంటోంది. టెల్లీ వ్యవస్థాపకుడు ఇలియా పోజిన్ దీనిపై ప్రకటన విడుదల చేశారు. కాకపోతే ఏదీ ఉచితంగా రాదని తెలుసుగా. ఇది కూడా అంతే. ప్రధాన టీవీకి అనుబంధంగా మరో చిన్న స్క్రీన్ కూడా ఉంటుంది. దానిపై నాన్ స్టాప్ గా ప్రకటనలు ప్రసారం అవుతుంటాయి. వాటిని చూస్తే చాలు. దీనివల్ల టెల్లీకి మంచి ప్రకటనల ఆదాయం వస్తుంటుంది. అందుకే టీవీలను ఉచితంగా ఇవ్వనుంది. ఇప్పటికే 50వేల టీవీ సెట్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రధాన టీవీలో మాత్రం నచ్చిన కార్యక్రమాలను చూసుకోవచ్చు. 

టీవీతో పాటు వచ్చే చిన్న స్క్రీన్ ను ‘స్మార్ట్ డిస్ ప్లే’ అని అంటారు. ప్రకటనల స్క్రీన్ సౌండ్ బార్ తో టీవీకి వేరయ్యి  ఉంటుంది. ఈ చిన్న స్క్రీన్ లోనే స్పోర్ట్స్ స్కోరులు, న్యూస్ టిక్కర్లు, వాతావరణం, స్టాక్ ధరలు కోట్ అవుటుంటాయి. టీవీని ఉచితంగా ఇవ్వడం వెనుక మార్కెట్ వాటాను పెంచుకునే ఎత్తుగడ కనిపిస్తుంది. మరింత ఆశ్చర్యకరం ఏమిటంటే.. ప్రధాన టీవీని కట్టేసినప్పుడు ఈ చిన్న స్క్రీన్ ఆఫ్ అయిపోదు. చిన్న స్క్రీన్ తోపాటు, పెద్ద టీవీ కూడా ప్రకటనల కోసం యాక్టివేట్ అవుతుంది.

  • Loading...

More Telugu News