Chief Minister Post: మా నేతకు సీఎం పదవి ఇవ్వాలి.. కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త ట్విస్ట్

Amid Siddaramaiah DK Shivakumar Tussle now New Claims For Chief Minister Post

  • తుమకూరులో జి.పరమేశ్వర మద్దతుదారుల ఆందోళన
  • దళితుడిని సీఎం చేయాలంటూ నినాదాలు, ప్లకార్డులు
  • ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ ‘సీఎం’ పంచాయితీ.. మూడు రోజులుగా అదే ఉత్కంఠ

కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఇద్దరు నేతల్లో ఒకరిని ఎంపిక చేయలేక కాంగ్రెస్ అధిష్ఠానం అష్టకష్టాలు పడుతోంది. కీలక నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌.. సీఎం పదవి తనకే కావాలని పట్టుబడుతుండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియని గందరగోళంలో కాంగ్రెస్ పడిపోయింది. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటక సీఎం రేసులోకి మరో వ్యక్తి పేరు చేరింది. తమ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయలంటూ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ రోజు తుమకూరులో వారు నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్‌ జెండాలు చేతబట్టుకుని, పరమేశ్వరకు మద్దతుగా నినాదాలు చేశారు. ‘దళితుడిని సీఎం చేయాలి’ అని ప్లకార్డులు ప్రదర్శించారు.

మరోవైపు లింగాయత్ కమ్యూనిటీ నుంచి 34 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారని, వారిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని ఆలిండియా వీరశైవ మహాసభ.. కాంగ్రెస్ చీఫ్ కు లేఖ రాసింది. ఇద్దరిలో ఒకరని ఎంపిక చేయలేకే దిక్కులు చూస్తుంటే.. ఇప్పుడు డిమాండ్లు పెరుగుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ తలపట్టుకుంటోంది. ఆలస్యం చేసేకొద్దీ ఇంకెంత మంది పేర్లు వినిపిస్తాయోనని నేతలు చర్చింకుంటున్నారు.

  • Loading...

More Telugu News